యూఏఈ ట్రాఫిక్ తగ్గేందుకు స్కూల్స్ కు విజ్ఞప్తి
- December 29, 2023
యూఏఈ: ప్రస్తుతం సెలవులు కావడంతో స్థానికులు, వాహనదారులు ట్రాఫిక్ తక్కువగా ఉందని తెలిపారు. వచ్చే వారం మళ్లీ తరగతులు ప్రారంభమైనప్పుడు ట్రాఫిక్ సాఫీగా ఉండేందుకు పాఠశాలలు వివిధ సమయాలను పాటించాలని కొందరు సూచిస్తున్నారు. ట్రాఫిక్ లేనందున దాదాపు 20 శాతం సమయం ఆదా అవుతుందని దుబాయ్ నివాసి ఫెర్డినాండ్ ఫ్రాగా హర్షం వ్యక్తం చేశారు. దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్లో ఉన్న స్కూల్స్ టైమింగ్స్ వలన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని పేర్కొన్నారు. “పాఠశాలలు లేని సమయంలో భారీ ట్రాఫిక్ ఉండదు. పాఠశాలలకు వేర్వేరు సమయాలను పాటించడం వలన ట్రాఫిక్ కు ఒక పరిష్కారం అని లభిస్తుందని భావిస్తున్నాను. కాబట్టి విద్యార్థులు అందరూ ఒకే సమయంలో రాకపోవడం వలన కార్ల సంఖ్య తగ్గుతుంది. ” అని వివరించారు. మరోవైపు అల్ బార్షా సౌత్‌లోని బ్లూమ్ వరల్డ్ అకాడమీ వ్యవస్థాపక ప్రిన్సిపాల్ జాన్ బెల్ మాట్లాడుతూ.. యూఏఈలో ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే స్కూల్స్ కారణంగా తక్కువ ఒత్తిడి, తక్కువ ట్రాఫిక్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. "విద్యార్థులు చాలా ముందుగానే లేవవలసి వచ్చినప్పుడు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. యూఏఈలో చాలా సందర్భాలలో ఉదయం 5.30 లేదా ముందుగానే పాఠశాల బస్సులు వారిని ఎక్కించుకున్నప్పుడు ఇది వారి మొత్తం ఆరోగ్యం, శ్రద్ధ, ప్రవర్తన మరియు ఉత్పాదకతపై హానికరమైన ప్రభావాలను చూపుతుంది.” అని షార్జాలోని NMC మెడికల్ సెంటర్లోని స్పెషలిస్ట్ శిశువైద్యుడు డాక్టర్ సంజయ్ ఉధాని తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







