వాల్మీకి ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ
- December 30, 2023
అయోధ్య: ప్రధాని మోడీ అయోధ్యలో ఈరోజు వాల్మీకి ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన తర్వాత సభలో మాట్లాడుతూ.. తీర్థయాత్రలకు మన దేశం పెట్టింది పేరు అని, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు దైవ యాత్రలు చేపడుతుంటారని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్య యాత్ర అనంతమైందని చెప్పిన ప్రధాని మోడీ.. ఆయా రాష్ట్రాల్లో భక్తులు చేపట్టే యాత్రల గురించి వివరించారు. జ్యోతిర్లింగ యాత్ర, ఛార్‌ధామ్ యాత్ర, శబరిమల యాత్రల గురించి చెబుతూనే తెలంగాణలో జరిగే సమ్మక్క సారక్క, నాగోబా జాతరలను కూడా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. వారసత్వం మనకు సరైన మార్గం చూపుతుంది. అయోధ్యను దేశ చిత్ర పటంలో సగర్వంగా నిలబెడుదాం. ఇప్పుడు అయోధ్య రాముడి కోసం పెద్ద మందరం సిద్ధం అయింది. చుట్టుపక్కల ప్రాంతాలతో అయోధ్యను అనుసంధానం చేస్తున్నామని మోడీ తెలిపారు.
సరయూ తీరంలో కొత్త ఘాట్ల నిర్మాణం జరుగుతుంది. అయోధ్యలో కొత్త టౌన్ షిప్ నిర్మాణం జరుగుతోంది. తొలి అమృత్ రైలు అయోధ్య నుంచి ప్రయాణిస్తుంది. జనవరి 22న రాముడి ప్రతిష్టాపన రోజు భక్తులు అయోధ్య కు రావద్దని సూచించారు ప్రధాని మోడీ. 500 ఏళ్లు రాముడి ఆలయం కోసం పోరాటం చేశాం. ప్రపంచం మొత్తం అయోధ్య రామాలయం కోసం ఎదురుచూస్తుంది. ఆధునిక అయోధ్య స్థాపనకు అంకురార్పణ జరిగిందన్నారు. యూపీ మొత్తం అభివృద్ధికి అయోధ్య స్పూర్తి అన్నారు. అయోధ్య కు వచ్చే ప్రతీ రామభక్తుడికి దర్శనం సులువుగా అయ్యేవిధంగా చేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!