సూర్యతాపానికి చర్మం నల్లగా మారడాన్ని తగ్గిద్దాం.!
- May 29, 2016
ఈ కాలంలో సూర్యతాపానికి చర్మం నల్లగా మారుతుంది. ఎండకు మురికీ, జిడ్డు పేరుకుపోయి.. కాంతివిహీనంగా మారుతుంది. ఈ సమస్యలకి పరిష్కారం ఎలాగంటే...
టొమాటోలు
రెండు టొమాటోలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకీ రాసి అరగంటయ్యాక చల్లటి నీళ్లతో కడిగేయాలి. టొమాటోల్లోని యాంటీఆక్సిడెంట్లు...చర్మం మీద నలుపును దూరం చేస్తాయి. మృతకణాలూ తొలగిపోయి.. కొత్త కణాలు వృద్ధి అవుతాయి. ఈ గుజ్జు సన్‌స్క్రీన్ లోషన్ మాదిరి పని చేస్తుంది.
కలబంద
నిమ్మరసంలో కొద్దిగా కలబంద గుజ్జును కలిపి బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేయాలి. ఇరవై నిమిషాల గోరువెచ్చటి నీళ్లతో కడిగి ఐసు ముక్కలతో మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అలసిన చర్మానికి సాంత్వన కలుగుతుంది. నల్లగా మారిన చర్మం కాంతిమంతంగా అవుతుంది.
బంగాళాదుంప
బంగాళాదుంపల్ని మెత్తని గుజ్జులా చేసి.. అందులో కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంతో ముఖం, మెడ, చేతులు మర్దన చేసుకోవాలి. కాసేపయ్యాక కడిగేసుకోవాలి. బంగాళాదుంపలోని టాన్ తగ్గించే గుణాలు చర్మాన్ని శుభ్రం చేసి మురికిని దూరం చేస్తాయి.
సెనగపిండి:
రెండు చెంచాల సెనగపిండిలో చెంచా పసుపు, కాసిని పాలు, గులాబీ నీళ్లు కలిపి...పూతలా వేసుకోవాలి. పసుపు ముఖం మీద మురికిని తొలగిస్తుంది. సెనగపిండి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. రెండురోజుల కోసారి ఈ ప్యాక్‌ని ప్రయత్నిస్తే ఎంతో మేలు.
గంధం
ఫ్రిజ్‌లో ఉంచిన గులాబీ నీళ్లలో రెండు చెంచాల గంధం పొడి చేర్చి.. ఎండలోంచి ఇంటికి రాగానే ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. గంధం చర్మానికి తేమనందిస్తుంది. శరీరంలోని వేడిని బయటకు పంపుతుంది. చర్మం నిగారింపును సంతరించుకోవడానికి దోహదం చేస్తుంది.
ఓట్ మీల్
పావుకపుప చిక్కని మజ్జిగ తీసుకుని అందులో ఓ మూడు చెంచాల ఓట్స్‌ని చేర్చాలి. కాసేపు పక్కన పెట్టి తర్వాత ఈ మిశ్రమంతో ముఖాన్ని మర్దన చేసుకుని కడిగేయాలి. మజ్జిగ చర్మానికి చల్లదనాన్నీ, తేమనీ అందిస్తుంది. ఓట్స్ మృతచర్మాన్నీ, టాన్నీ వదల గొడతాయి.
ముల్తానీ మట్టి
రెండు చెంచాల కలబంద గుజ్జును తీసుకుని.. అందులో కొద్దిగా ముల్తానీ మట్టి, గులాబీనీళ్లు చేర్చాలి. ఈ పేస్టును కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి ప్యాక్ వేసుకోవాలి. అరగంటయ్యాక చల్లని నీళ్లతో కడిగేసుకుని... శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









