ఎప్లాయ్ మెంట్ మార్కెట్ లో 3.9 మిలియన్ల సౌదీలు నమోదు
- December 31, 2023
రియాద్: జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ (GOSI)లో నమోదైన గణాంకాల ప్రకారం.. 2023 మూడవ త్రైమాసికం చివరి నాటికి సౌదీ ఉపాధి మార్కెట్లో నమోదు చేసుకున్న సౌదీ పురుషులు, మహిళల మొత్తం సంఖ్య 3,921,321కి చేరింది. ఇందులో మహిళలు 1,563,536 మంది (39.9 శాతం), పురుషులు 2,357,785 మంది(60.1 శాతం) ఉన్నారు. సామాజిక బీమా వ్యవస్థ, నిబంధనల క్రింద వచ్చే సౌదీ పురుష, మహిళా ఉద్యోగులు మొత్తం సౌదీ శ్రామిక శక్తిలో 68.8 శాతానికి (2,696,797) చేరుకుంది. సివిల్ సర్వీస్ సిస్టమ్ గణాంక గణాంకాల ప్రకారం.. సౌదీ పురుషులు మరియు మహిళల సంఖ్య 1,224,524. ఇది మొత్తం సౌదీ వర్క్‌ఫోర్స్‌లో 31.2 శాతానికి సమానం. పురుష ఉద్యోగుల సంఖ్య 716,024. మహిళా ఉద్యోగుల సంఖ్య 508,500కి చేరింది. 667,100 మంది ఉద్యోగులతో 30-43 ఏళ్ల వయస్సు ఉన్నవారు అత్యధికంగా ఉన్నారు. మొత్తం ఉద్యోగులలో 17 శాతం మంది ఉన్నారు. ఆ తర్వాత 35–39 ఏళ్ల వయస్సు గలవారు 640,496 మంది ఉద్యోగులతో 16.3 శాతం మంది ఉన్నారు. దీని తర్వాత 25-29 సంవత్సరాల వయస్సు గలవారు 629,475 మంది ఉద్యోగులతో ( 16 శాతం) ఉన్నారు. 40-44 సంవత్సరాల వయస్సు గలవారు 585,734 మంది ఉద్యోగులలు(14.9 శాతం) ఉన్నారు.
తాజా వార్తలు
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!
- ప్రపంచ చరిత్రలోనే తొలిసారి ఉక్రెయిన్ అద్భుత రెస్క్యూ ఆపరేషన్
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!







