ఎన్టీయార్ ఫ్యాన్స్ హ్యాపీనా.?
- January 02, 2024
నూతన సంవత్సరం సందర్బంగా ఎన్టీయార్ కొత్త సినిమా నుంచి తాజా అప్డేట్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. అదే ‘దేవర’ పోస్టర్. నిజానికి ‘దేవర’ నుంచి గ్లింప్స్ ఎక్స్‌పెక్ట్ చేశారు అభిమానులు.
కానీ, జస్ట్ పోస్టర్ రిలీజ్ చేసి చేతులు దులిపేసుకున్నారు చిత్ర యూనిట్. పోస్టర్ అయితే పవర్ ఫుల్‌గానే వుంది. కానీ, ఇది సరిపోతుందా.? అంటే ఖచ్చితంగా సరిపోదు.
సినిమా ఏప్రిల్‌లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నట్లు సంకేతాలు పంపిస్తోంది కొరటాల అండ్ టీమ్. షూటింగ్ శరవేగంగానే జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఒక చిన్న గ్లింప్స్ అయినా రిలీజ్ చేసి వుండుంటే బాగుండేదిగా అనేది ఫ్యాన్స్ అభిప్రాయం. ఇకపోతే, ‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత సెట్ అయిన కొరటాల - ఎన్టీయార్ కాంబినేషన్ ఇది.
అయితే, ఆ తర్వాత ‘ఆచార్య’ రూపంలో కొరటాలకు ఫెయిల్యూర్ వున్న సంగతి తెలిసిందే. ఆ ఫెయిల్యూర్‌ని ఈ సినిమాతో అది కూడా గ్లోబల్ స్టార్ అయిన తారక్‌తో ఓవర్ కమ్ చేయాలి. కొట్టే హిట్టు.. గట్టిగా వుండాలి. అందుకోసం అటు కొరటాల ఇటు ఎన్టీయార్ ఏం చేస్తారనేది తెలియాలంటే ఈ సినిమా నుంచి రిలీజ్ కాబోయే ప్రతీ ప్రోమో సినిమాపై అంచనాలు పెంచేదిలా వుండాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







