జేఈఈ పాఠ్యాంశాలు మొబైల్ యాప్‌లో
- May 29, 2016
జేఈఈ ప్రవేశ పరీక్ష రాసే అభ్యర్థులకు సహాయపడేందుకు కేంద్రం చర్యలు చేట్టింది. భారీ పోటీని ఆసరాగా చేసుకొని కోచింగ్ కేంద్రాలు చేస్తున్న హడావుడిని కట్టడి చేయడానికి కొత్త మొబైల్ యాప్‌ను తీసుకురావాలని భావిస్తుంది. 'ఐఐటీ-పాల్' పేరుతో రూపొందించనున్న ఈ యాప్‌లో ఉచితంగా పూర్తి పాఠ్యాంశాలను(స్టడీ మెటేరియల్)ను అందజేయాలని స్మృతి ఇరానీ నేతృత్వంలోని కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయించింది. తెలుగు, ఆంగ్లం, హిందీ, బెంగాలీ, ఒడియా, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, తమిళ భాషల్లో ఈ పాఠ్యాంశాలను అందజేయనున్నారు. భౌతిక, రసాయన, గణితంలోని అన్ని అంశాలతో నాణ్యమైన మెటేరియల్‌ను తయారు చేయనున్నట్లు హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వశాఖ తెలిపింది. ఐఐటీ ప్రవేశ పరీక్ష కోసం సుమారు 150 పాఠ్యాంశాలపై పట్టు సాధించాల్సి ఉంటుందని చెప్పింది. అభ్యర్థులకు సులభంగా అర్థమయ్యేలా నోటú్స తయారు చేయడానికి ఐఐటీ విద్యార్థులకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఒక్కో పాఠ్యాంశానికి ఒక బృందాన్ని ఎంపిక చేస్తామని వెల్లడించింది. ఎంపికైన వారికి రూ.లక్ష వరకు పారితోషకం కూడా అందజేయనున్నట్లు చెప్పింది. సరైన సహకారం లేని విద్యార్థులను ప్రోత్సహించడానికి సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి ఐఐటీ అధ్యాపకుల నుంచి అభ్యర్థులు సలహాలు పొందవచ్చని చెప్పింది. ఐఐటీ అభ్యర్థులపై కోచింగ్ కేంద్రాల ఒత్తిడిని తగ్గించడానికి చర్యలు చేపట్టాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చెప్పారని.. వచ్చే రెండేళ్లలో ఐఐటీ-పాల్ పోర్టల్, యాప్‌ను తీసుకురానున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం







