టీ20 ప్రపంచకప్ కోసం 25 నుంచి 30 మంది ఆటగాళ్లతో షార్ట్ లిస్ట్
- January 02, 2024
టీ20 ప్రపంచకప్ పై భారత్ దృష్టి సారింది. వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టును ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన అనంతరం ఎంపిక చేయనున్నారు.
కాగా.. ఇప్పటికే ఈ మెగా టోర్నీ పై దృష్టి సారించిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 25 నుంచి 30 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేయాలనే నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఈ ఆటగాళ్లను ఐపీఎల్ సీజన్ మొత్తం పర్యవేక్షించనున్నారని, ఆ తరువాత వీరిలోంచి జట్టును ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. వీరిలో స్టార్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లు ఉండనున్నారనే వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి 2022 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీమ్ఇండియా తరుపున మరో టీ20 మ్యాచ్ ఆడలేదు. ఈ విషయమై వీరిద్దరితో మాట్లాడడంతో పాటు షార్ట్ లిస్టులో ఎవరెవరిని ఎంపిక చేయాలనే విషయమై కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో చర్చించేందుకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కేప్‌టౌన్‌కు వెళ్లనున్నారు. ప్రతి స్థానానికి కనీసం ఇద్దరు ఆటగాళ్లతో పెద్ద పూల్‌ను తయారు చేయనున్నారు. ఒకవేళ ఎవరైనా ఆటగాడు గాయపడిన ప్రత్యామ్నాయ ఆటగాడి ఎంపికకు ఇబ్బంది లేకుండా కసరత్తులు చేస్తున్నారు. షార్ట్‌లిస్ట్‌లోని ఆటగాళ్లందరినీ నేషనల్ క్రికెట్ అకాడమీ ఫిజియోలు, బీసీసీఐ వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంది.
ప్రస్తుతానికి సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య లు ఫిట్‌గా లేరు. గాయాల నుంచి కోలుకుంటున్నారు. వీరిద్దరు అఫ్గాన్ సిరీస్‌లో ఆడే విషయమైన ఇప్పటికైతే ఖచ్చితమైన సమాచారం లేదు. ఐపీఎల్ సమయానికి వీరిద్దరి ఫిట్‌నెస్‌తో పాటు ఎవరెవరు టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతారు అనే విషయమై స్పష్టత వస్తుందని ఓ బీసీసీఐ అధికారి పీటీఐకి వెల్లడించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!







