170 ప్రైవేట్ స్కూళ్లలో సైబర్ సెక్యూరిటీ పాఠాలు
- January 03, 2024
దోహా: జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA), విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) భాగస్వామ్యంతో మొదటి దశలో 170 ప్రైవేట్ పాఠశాలల్లో సైబర్ సెక్యూరిటీ ఎడ్యుకేషనల్ కరిక్యులం అమలు చేయనున్నారు. తదుపరి దశలో మరో 100 ప్రైవేట్ పాఠశాలలకు విస్తరిస్తారు. డిజిటల్‌గా సురక్షితమైన సమాజాన్ని నిర్మించడానికి 2023లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన తర్వాత ప్రైవేట్ పాఠశాలల్లో ఎడ్యుకేషనల్ సైబర్‌సెక్యూరిటీ పాఠ్యాంశాలను అమలు చేయడం జరుగుతుంది. సైబర్‌సెక్యూరిటీ ఎడ్యుకేషనల్ కరిక్యులం డిజిటల్ ప్రపంచంతో సురక్షితంగా, ప్రభావవంతంగా వ్యవహరించే సామర్థ్యాన్ని కలిగి ఉన్న కొత్త తరాన్ని నిర్మించడం, సైబర్‌సెక్యూరిటీ మరియు డిజిటల్ భద్రతకు సంబంధించిన వివిధ భావనలపై స్కూల్ పిల్లలలకు అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు MoEHEలోని ప్రైవేట్ విద్యా వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ ఒమర్ అబ్దుల్ అజీజ్ అల్ నైమా స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ మొదటి దశలో 80 ప్రభుత్వ పాఠశాలలలో అమలు చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







