ఒమన్‌లో చిత్రీకరించిన ‘రాస్తా’ జనవరి 5న విడుదల

- January 03, 2024 , by Maagulf
ఒమన్‌లో చిత్రీకరించిన ‘రాస్తా’ జనవరి 5న విడుదల

మస్కట్: పూర్తిగా ఒమన్‌లో చిత్రీకరించిన మలయాళంలో తొలి అంతర్జాతీయ చిత్రం ‘రాస్తా’ జనవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఇతివృత్తం దక్షిణ భారత రాష్ట్రమైన కేరళ కంటే పది రెట్లు ఉన్న రబ్ అల్ ఖలీ ఎడారి నేపథ్యంలో సాగుతుంది. ఇది తన తల్లిని వెతకడానికి గల్ఫ్‌కు వెళ్లే అమ్మాయి హృదయాన్ని కదిలించే కథగా నిర్మతలు తెలిపారు. చాలా మంది ఒమానీ పౌరులు కూడా సినిమాలో నటించినట్లు పేర్కొన్నారు. అనీష్ అన్వర్ దర్శకత్వం వహించిన సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం ‘రాస్తా’లో సర్జానో ఖలీద్, అనఘా నారాయణన్, ఆరాధ్య ఆన్, సుధీష్, ఇర్షాద్ అలీ, టి.జి. రవి, అనీష్ అన్వర్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.. ఏఎల్‌యూ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై లిను శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మేరకు ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినిమా నిర్మతలు పాల్గొని.. ఒమన్‌లో షూటింగ్‌లో తమ గొప్ప అనుభవాన్ని , మునుపటి సంఘటనల ఆధారంగా రూపొందించిన కథను వివరించారు. ఈ కార్యక్రమంలో ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్, ఫైసల్ బిన్ అబ్దుల్లా అల్ రావాస్ పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com