అగ్నిప్రమాదంలో గిడ్డంగుల దహనం
- May 29, 2016
భారీ అగ్ని ప్రమాదం కారణంగా షార్జా ఇండస్ట్రియల్ ఏరియాలో పలు వేర్ హౌస్‌లు (గిడ్డంగులు) దహనమయ్యాయి. షార్జా సివిల్ డిఫెన్స్ అధికారులు ప్రమాద వివరాల్ని వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇండస్ట్రియల్ ఏరియా 18లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షార్జా హెడ్ క్వార్టర్స్, మువైల్, సమ్నాన్, అల్ మినా నుంచి ఫైర్ ఫైటర్స్ తక్షణం ప్రమాద స్థలికి చేరుకుని, మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మంటలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా తగిన చర్యలు చేపట్టామని అధికారులు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







