చమురుధరలతో యూఏఈ ఎకానమీ వృద్ధి
- May 29, 2016
చమురు ధరల రికవరీతో యూఏఈ ఎకానమీ వృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. బ్యారెల్ ముడిచమురు ధర 50 డాలర్లకు చేరడం పట్ల యూఏఈ ఎకానమీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీనియర్ అధికారి ఒకరు, తాజా పరిణామాలు యూఏఈ ఎకానమీకి ఊతమిస్తాయని చెప్పారు. 30 డాలర్ల దిగువకు పడిపోయిన బ్యారెల్ ముడిచమురు ధర 50 డాలర్లకి చేరుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఆయన అన్నారు. యూఏఈ, రోజుకి 2.8 మిలియన్ బ్యారల్స్ ఉత్పత్తి జరుగుతోందనీ, ఈ మొత్తాన్ని 3.5 మిలియన్ బ్యారెల్స్‌కి పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) సభ్యుడు చెప్పారు. ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు ఒపెక్ మెంబర్స్, గురువారం సమావేశమవనున్నారు. రాజకీయాల్ని పక్కన పెట్టి, 'ఒపెక్' సమావేశంలో ప్రతి సభ్య దేశం పాల్గొనాల్సి ఉందని తద్వారా ఎకనామీని వృద్ధి చేసుకోవడంతోపాటు మార్కెట్ స్థితిగతులపై అవగాహన ఇంకా పెంచుకోడానికి అవకాశం కలుగుతుందని కమోడిటీ స్ట్రేటజీ - సాక్సో బ్యాంక్ హెడ్ ఓల్ హాన్సెన్ అభిప్రాయపడ్డారు.గత నెలలో దోహాలో జరిగిన సమావేశంలో ఓ అవగాహన కుదుర్చుకోవడంలో సభ్య దేశాలు విఫలమయ్యాయి. ఇరాన్, సమావేశంలో పాల్గొనకపోవడాన్ని సౌదీ అరేబియా తప్పుపడుతోంది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







