కీర్తి సురేష్ నవ్వుల జాతర ఇంకోస్సారి.!
- January 03, 2024
‘గుడ్ లక్ సభి’ అంటూ గతంలో ఓ సినిమాలో నటించింది కీర్తి సురేష్. చాలా బబ్లీగా.. క్యూట్‌గా కనిపిస్తూ నవ్వులు పూయించింది ఆ సినిమాలో కీర్తి సురేష్. అయితే, దురదృష్టవశాత్తూ ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేదనుకోండి.
అయినా మహానటిగా ఉన్నతమైన హుందా అయిన పాత్రలనే కాదు, కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా డీల్ చేయగల సత్తా వున్న నటి. తాజాగా ఆమె ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది.
ఆ సినిమాని ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ హోంబలే ప్రొడక్షన్స ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ‘రఘుతాత’ అనే టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు.
ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ప్రోమో సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఆకట్టుకుంటోంది. త్వరలోనే వినోదాల సుడిగాలి మీ దగ్గరల్లోని ధియేటర్లను తాకబోతోంది సిద్ధంగా వుండండి.. అంటూ సోషల్ మీడియా వేదికగా కీర్తి సురేష్ పెట్టిన పోస్ట్ ఈ సినిమాకి సంబంధించి ఆసక్తిని రేకెత్తిస్తోంది. సుమన్ కుమార్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







