ఆ ప్రేమ జంట పెళ్లికి సిద్ధమయినట్లేనా.?
- January 03, 2024
సెలబ్రిటీల పెళ్లి వార్తలన్నీ విచిత్రంగానే జరుగుతుంటాయ్. అరేంజెడ్ మ్యారేజెస్ సంగతి పక్కన పెడితే, కొన్ని లవ్ మ్యారేజ్లు మాత్రం మొదట ప్రచారాల పర్వంతో మొదలై, ఆ తర్వాత సహజీవనాలతో సాగి.. చివరికి పెళ్లి ముడితో ముగుస్తుంటాయ్.
చాలా జంటల విషయంలో ఇలాగే జరిగింది. లేటెస్ట్గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విషయంలోనూ ఇదే జరిగింది. తాజాగా సిద్ధార్ద్, అదితి రావ్ హైదరీ జంట ట్రెండింగ్ అవుతోంది. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్యా ఏదో నడుస్తోందంటూ గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
అందుకు తగ్గట్లుగానే ఈ జంట ఎక్కడ కనిపించినా గాలి కూడా చొరబడనంత క్లోజ్‌గా మూవ్ అవుతూ కెమెరా కంటికి చిక్కుతుండడం.. కలిసి పార్టీలు, వెకేషన్లూ ఎంజాయ్ చేస్తుండడం... ఆ సెలబ్రేషన్స్‌ని సోషల్ మీడియాలో పంచుకుంటూ, సంకేతాలివ్వడం చేస్తున్నారు.
దాంతో, త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతోందంటూ ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడా ప్రచారం మరింత జోరందుకుంది. సిద్దార్ధ్కి ఆల్రెడీ గతంలో వివాహం జరిగింది. మనస్సర్ధల కారణంగా భార్యతో విడాకులు తీసుకుని సింగిల్‌గా వుంటున్నాడు.
ఆ మధ్యలో చాలా మంది హీరోయిన్లతో రిలేషన్షిప్స్ పెట్టుకున్నప్పటికీ తాజాగా అదితీ రావ్ హైదరితో క్లోజ్‌గా మూవ్ అవుతున్నాడు. ఇద్దరి అభిప్రాయాలూ, అభిరుచులు కలిస్తే ఏమో త్వరలోనే పెళ్లి చేసుకుంటారేమో.. ఇప్పటికైతే ఈ యవ్వారం జస్ట్ ప్రచారంగానే నడుస్తోంది మరి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







