ఓల్డ్ దోహా పోర్ట్.. జనవరిలో జరిగే పబ్లిక్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్‌ల జాబితా
- January 05, 2024
దోహా: ఓల్డ్ దోహా పోర్ట్ జనవరి నెల మొత్తం ఈవెంట్‌ల సందడిని ఆవిష్కరించింది. ఈ మేరకు దాని అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దాని ప్రకారం.. పోర్ట్ తన వింటర్ ఫెస్టివల్‌ను జనవరి 7 వరకు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో మ్యాజిక్ సెషన్స్, స్టిల్ట్ వాకర్స్ లైవ్లీ మస్కట్‌లతో ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే వరల్డ్ వైడ్ వాల్స్ మ్యూరల్ ఫెస్టివల్ లో13 మంది స్థానిక మరియు అంతర్జాతీయ కళాకారులు పాల్గొంటారు. వీటితోపాటు ప్రతిరోజూ నాలుగు సార్లు డైనమిక్ రోమింగ్ కవాతు ఉంటుంది.
జనవరి 19న జరిగే కస్టమ్ షో పరేడ్ ఉంటుంది. ఇందులో క్లాసిక్ కార్ల సేకరణను ప్రదర్శిస్తారు. ఫుట్‌బాల్ ఔత్సాహికుల కోసం AFC ఆసియా కప్ ఖతార్ 2023 జనవరి 12 నుండి ఫిబ్రవరి 10 వరకు జరుగుతుంది. ఖతార్ కైట్ ఫెస్టివల్ రెండవ ఎడిషన్ జనవరి 25 నుండి ఫిబ్రవరి 3 వరకు పాత దోహా పోర్ట్‌లో జరుగనుంది. మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ పార్క్‌లో ప్రపంచవ్యాప్తంగా హాజరై భారీ గాలిపటాలను ఎగురవేస్తారు. క్రూయిజ్ టెర్మినల్ ముందు జరిగే ఈవెంట్ ఏప్రిల్ వరకు కొనసాగే క్రూయిజ్ సీజన్‌లో అంతర్జాతీయ ప్రయాణికులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. వీటితో పాటు, ఖతార్ టూరిజం నెల పొడవునా ఇతర కార్యక్రమాలను హైలైట్ చేసింది.
జనవరి 6 వరకు దోహా ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్‌లో దోహా ట్రేడ్ ఫెయిర్, జనవరి 11 వరకు ఓల్డ్ వక్రా సౌక్ వద్ద ఇంటర్నేషనల్ సర్కస్: బియాండ్ రియాలిటీ, జనవరి 6 వరకు మ్షీరెబ్ డౌన్‌టౌన్ దోహాలో బరాహా మూవీ నైట్స్ మరియు పాలస్తీనా: ఎ జర్నీ త్రూ టైమ్ ఉన్నాయి. జనవరి 31 వరకు ఇస్లామిక్ ఆర్ట్ మ్యూజియంలో పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నారు. అల్ షకాబ్‌లో జరిగే దోహా టూర్ 2024 జనవరి 13 వరకు కొనసాగుతుంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్‌లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







