హెబ్బా పటేల్ ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’.!
- January 06, 2024
‘కుమారి 21 ఎఫ్’ అంటూ క్రేజీ మూవీతో టాలీవుడ్‌కి పరిచయమైంది అందాల భామ హెబ్బా పటేల్. ఆ తర్వాత ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తదితర చెప్పుకోదగ్గ సినిమాల్లోనే నటించింది. కానీ, హీరోయిన్గా ఆశించిన స్థాయికి ఎదగలేకపోయింది.
ఈ మధ్య ఓటీటీల్లో సందడి చేస్తోంది. మొన్నా మధ్య ‘ఓదెల రైల్వేస్టేషన్’ అనే ఓటీటీ సినిమాలో తనదైన పర్ఫామెన్స్ ఇచ్చి శభాష్ అనిపించుకుంది హెబ్బా పటేల్.
మరిన్ని ఓటీటీ సిరీస్‌లతో బిజీగా గడుపుతోంది. తాజాగా ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ రోజు హెబ్బా పటేల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
శారీలో నవ్వులు చిందిస్తూ.. చాలా ప్లెజెంట్‌గా కనిపిస్తోంది ఈ లుక్‌లో హెబ్బా పటేల్. సినిమాలు కాస్త తగ్గినా.. ఓటీటీలో ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ హెబ్బా పటేల్ కెరీర్లో బిజీగానే గడుపుతోంది.
ఈ నేపథ్యంలోనే ఈ పుట్టినరోజు ఆమెకు మరెన్నో విజయవంతమైన చిత్రాలను అందించాలనీ, కెరీర్లో మరిన్ని మైలురాయిలు అందుకోవాలని ఆశిస్తూ.. హ్యాపీ బర్త్ డే టు యు హెబ్బా పటేల్.
తాజా వార్తలు
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!







