సౌత్‌లో అడుగు పెడుతోన్న మరో నార్త్ ముద్దుగుమ్మ.!
- January 06, 2024
ఈ మధ్య బాలీవుడ్ సినిమాలకు ఆశించిన స్థాయి ఆదరణ దక్కడం లేదు. అదే తరుణంలో సౌత్ సినిమాలు సెన్సేషనల్ అవుతున్నాయ్.
ప్రపంచ వ్యాప్తంగా కీర్తి గడిస్తున్నాయ్. దాంతో, నార్త్ స్టార్స్ అంతా సౌత్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లకు ఒకప్పుడు సౌత్ సినిమాలంటే చాలా చిన్న చూపు వుండేది.
కానీ, ఇప్పుడా పరిస్థితి మారింది. సౌత్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే శ్రద్ధా కపూర్, అలియా భట్, దీపికా పదుకొనె.. తదితర నార్త్‌లో ఓ వెలుగు వెలుగుతున్న స్టార్ ముద్దుగుమ్మలు సౌత్ సినిమాల్ోల నటించేందుకు డేట్స్ ఇస్తున్నారు.
ఇప్పుడు అదే కోవలో కరీనా కపూర్ కూడా చేరిపోయిందనిపిస్తోంది. కరీనా కపూర్ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. పెళ్లి, పిల్లల తర్వాత కూడా అక్కడ ఆమె కెరీర్ కొనసాగిస్తూ మెస్మరైజ్ చేస్తోంది.
ఇప్పుడీ కపూర్ ఖాన్ బ్యూటీ సౌత్ సినిమాలో అదీ ఓ కన్నడ సినిమాలో నటించేందుకు సిద్ధమైందట. ‘కేజీఎఫ్’ సినిమాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన యష్ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు కరీనా ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
యష్ హీరోగా రూపొందుతోన్న ‘టాక్సిన్’ అనే సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్యాన్ ఇండియా చిత్రంగా లార్జ్ స్కేల్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకి స్టార్ వేల్యూ అద్దడం కోసమే చిత్ర యూనిట్ కరీనాని దించుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







