ఉద్యోగుల వార్షిక సెలవును యజమాని రద్దు చేయవచ్చా?
- January 07, 2024
యూఏఈ: ఉద్యోగులకు తెలియజేయకుండా వారి వార్షిక సెలవులను యజమాని రద్దు చేస్తే.. ఏమి చేయాలి? ఈ విషయంలో వారికున్న హక్కులు ఏమిటి? అన్న విషయాలను గమనిస్తే.. ఉపాధి సంబంధాల నియంత్రణపై చట్టం సంఖ్య (33/2021) ప్రకారం.. యజమాని ఉద్యోగుల వార్షిక సెలవును ఏకపక్షంగా రద్దు చేయవద్దు. అయితే, ఉద్యోగుల సర్దుబాటు, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని యజమాని ఉద్యోగుల వార్షిక సెలవు తేదీలను నిర్ణయించవచ్చు. సెలవు తేదీలను నిర్ణయించిన తర్వాత, యజమాని వార్షిక సెలవు దినాల ప్రారంభానికి కనీసం 1 నెల ముందుగా ఉద్యోగులకు తెలియజేయాలి. ఇది ఉపాధి చట్టంలోని ఆర్టికల్ (29)లోని క్లాజ్ 4లోని నిబంధనలలో పేర్కొన్నారు. ఒకవేళ ఆ ఏడాదిలో వార్షిక సెలవును పొందలేకపోతే, తదుపరి సంవత్సరానికి వాటిని ఫార్వార్డ్ చేయవచ్చు. లేదా దానికి బదులుగా సెలవు పేమెంట్ ను ఉద్యోగి కోరవచ్చు. ఉపాధి చట్టంలోని ఆర్టికల్ (29)లోని క్లాజ్ (8) మరియు క్లాజ్ (9)లోని నిబంధనలను ఈ విషయాన్ని పొందుపరిచారు. యజమాని ఉద్యోగికి తెలియజేయకుండానే ప్రీ-అప్రూవ్డ్ సెలవును రద్దు చేసినట్లయితే, అటువంటి నిర్ణయాన్ని రద్దు చేయమని యజమానిని కోరవచ్చు. యజమాని ఇప్పటికీ వర్తించే చట్టాలను ఉల్లంఘిస్తూ ఉద్యోగి హక్కులను హరిస్తే మాత్రం.. ఆ విషయాన్ని యూఏఈ మానవ వనరులు మరియు ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయవచ్చని ఆశిష్ మెహతా & అసోసియేట్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ భాగస్వామి ఆశిష్ మెహతా వివరించారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







