కిరణ్ అబ్బవరం దూకుడు తగ్గేదేలే.!
- January 09, 2024
‘రాజావారు రాణివారు’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమైన కుర్రోడు కిరణ్ అబ్బవరం. చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని సైతం వదులుకుని సినిమాపై ప్యాషన్‌తో ఇండస్ర్టీలోకి అడుగుపెట్టాడు.
తొలి సినిమాతో సమ్‌థింగ్ స్పెషల్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత ‘ఎస్ ఆర్ కళ్యాణ మండపం’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ , రూల్స్ రంజన్’ తదితర సినిమాలతో యూత్‌లో సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడీ యంగ్‌స్టర్.
మరీ సక్సెస్‌ఫుల్ హీరో అనలేం కానీ, వరుసగా అవకాశాలు మాత్రం కిరణ్ అబ్బవరాన్ని తట్టి లేపుతూనే వున్నాయ్ సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా.
ఈ ఏడాది రెండు సినిమాలు ఆల్రెడీ లైన్‌లో పెట్టేశాడు. అందులో ఒకటి కరుణ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా. ఇంకో సినిమా కోసం సందీప్ - సుజిత్ అనే ఇద్దరు దర్శకులతో పని చేస్తున్నాడు.
ఈ సినిమా 1980 పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. పోస్ట్‌మెన్ క్యారెక్టర్‌లో కిరణ్ అబ్బవరం నటించబోతున్నాడనీ తెలుస్తోంది. పోస్ట్‌మెన్ గెటప్‌లో ఇప్పటికే పలువురు హీరోలు తెలుగు తెరపై సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే, డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కబోయే ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం కొత్తగా ఏం చెప్పబోతున్నాడో చూడాలి మరి. ఈ ఏడాదిలోనే ఈ రెండు సినిమాలూ రిలీజ్ కాబోతున్నాయని తెలుస్తోంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!