నయన తారపై కేసులు.! మనోభావాలు దెబ్బ తిన్నాయ్ మరి.!
- January 09, 2024
ఇప్పుడు సినిమాల్లో ఏదైనా తప్పులు దొర్లితే చాలు.. ఇట్టే పట్టేస్తున్నారు. మనోభావాల పేరుతో కేసులు, ధర్నాలూ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ తరహా గొడవలు ఆయా సినిమాలకి ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెడుతున్నాయనుకోండి. అయితే, కొన్ని సినిమాలు మాత్రం దెబ్బ తినేస్తున్నాయ్.
అసలు మ్యాటర్ ఏంటంటే, తాజాగా సౌత్ క్వీన్, లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ‘అన్నపూరణి’ సినిమా ఇలాగే గొడవల్లో చిక్కుకుంది.
కారణమేంటంటారా.? ఈ సినిమాలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయిగా నయన తార నటించింది. కానీ, ఓ ముశ్లింతో ప్రేమలో పడడం.. అంతేకాదు, తన డ్రీమ్ నెరవేర్చుకునే దిశగా ఇండియా గర్వించదగ్గ ఛెఫ్ అవ్వాలని కోరుకోవడం.. ఆ క్రమంలో నాన్‌వెజ్ కూడా భుజించాల్సి వస్తుంది.
ఇదే ఇప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బ తినడానికి కారణమైంది. దాంతో, నయన తారపై కేసులు పెట్టారు. ఇలాంటి కథల్ని ఎంకరేజ్ చేయకూడదంటూ మత విద్వేషాల్ని రెచ్చగొట్టేలా వుందని వాదిస్తున్నారు.
ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో వుంది. ధియేటర్లో అంతంత మాత్రమే అనిపించుకున్నప్పటికీ.. ఓటీటీలో మాత్రం ఈ సినిమాకి ఆదరణ బాగానే దక్కుతోంది. తాజా పరిణామాలతో ఆ పరిస్థితి ఎలా మారుతుందో ఈ గొడవ ఎంత దూరం వెళుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!