దేవర’ ఊచకోత మొదలైంది.!
- January 09, 2024
‘ఆర్ఆర్ఆర్’ వంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత ఎన్టీయార్ చేయబోతున్న సినిమా ‘దేవర’. ఇదిగో అదిగో అంటూ ఊరిస్తూ ఈ సినిమా టీజర్‌ని ఎట్టకేలకు రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
80 సెకన్ల నిడివితో సాగిన ఈ టీజర్‌లో ఎన్టీయార్‌పై చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్‌కి ఫ్యాన్స్‌లో పూనకాలు మొదలయ్యాయ్. కారుమబ్బులతో నిండిన ఆకాశం.. అలజడితో ఎగసిపడుతున్న సముద్ర కెరటాలు, ఆ సముద్రంలో ఓ ఓడ.. దానిపై కొందరు గూండాల దాడి.. వాళ్లని చీల్చి చెండాడుతున్న ఎన్టీయార్.. బ్యాక్ గ్రౌండ్‌లో ఇంగ్టీష్ సాంగ్.. సన్నివేశాన్ని వివరిస్తున్నట్లుగా వుంది.
చివరాఖరిలో ఈ సముద్రం చేపల్ని కంటే.. కత్తుల్నీ, నెత్తుర్నీ ఎక్కువగా చూసుంటాది. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు.. అంటూ ఎన్టీయార్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది.
ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏప్రిల్‌లో ఈ సినిమా మొదటి పార్ట్ రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!