కువైట్ లో త్వరలో నర్సుల నియామకాలు!
- January 10, 2024
కువైట్: కొత్త ఆసుపత్రులు, వైద్య కేంద్రాల కోసం స్థానిక లేదా బాహ్య కాంట్రాక్టుల ద్వారా వందలాది మంది నర్సులను నియమించుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అధికారిక నివేదిక ప్రకారం.. 2,000 మంది నర్సులను రిక్రూట్ చేయనున్నట్లు తెలుస్తుంది. నియామకాల ప్రణాళికను అధికారికంగా ఆమోదించిన తర్వాత భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వియత్నాం మరియు ఫిలిప్పీన్స్లకు చెందిన విదేశీ నర్సింగ్ బృందాలతో ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు కువైట్ లో నర్సులను ప్రొత్సహించేందుకు అదనపు ఆర్థిక బహుమతులు, ప్రోత్సాహకాలతో జాతీయ నర్సింగ్ కేడర్లకు మద్దతు ఇవ్వాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన ఆసుపత్రులు, కేంద్రాలలో 22,021 మంది నర్సులు పనిచేస్తున్నారు. వీరిలో 1,004 మంది కువైటీలు ( 4.6 శాతం) ఉండగా.. 21,017 మంది ప్రవాసులు (95.4 శాతం) ఉన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







