కొవిడ్ వైరస్‌తో డిసెంబరులో 10వేల మంది మృతి
- January 11, 2024
జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ -19 వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా పాక్షికంగా ప్రబలుతున్న కొవిడ్ వైరస్ పెద్ద ముప్పుగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెప్పారు. ఒక్క డిసెంబరు నెలలోనే కొవిడ్ వల్ల 10వేలమంది మరణించారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. క్రిస్మస్ సెలవుల కాలంలో కొవిడ్ జేఎన్ 1 వేరియంట్ అధికంగా వ్యాప్తి చెందింది.
కొవిడ్ వైరస్ ఇంకా ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తిచెందుతూనే ఉందని, ఈ వైరస్ వల్ల నవంబరు నెలలో ఆసుపత్రుల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేరిన వారి శాతం 42 నుంచి 62 శాతానికి పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కొవిడ్ వైరస్ అమెరికా, యూరప్ దేశాల్లో అధికంగా ప్రబలిందని టెడ్రోస్ పేర్కొన్నారు. కొవిడ్ వైరస్ పట్ల అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. ఒక్క డిసెంబరు నెలలోనే 10వేల కొవిడ్ మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
కొవిడ్ పరీక్షలు, చికిత్సలు, వ్యాక్సిన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని టెడ్రోస్ ప్రభుత్వాలను కోరారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్ టీకాలు వేయించుకోవాలని, కొవిడ్ పరీక్షలు చేయించుకోవడంతోపాటు ముందుజాగ్రత్తగా మాస్కులు ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ సూచించారు. 2019వ సంవత్సరం చివరలో చైనాలోని వుహాన్‌లో కోవిడ్ వైరస్ మొదటిసారిగా కనుగొన్నారు.
అనంతరం మూడు సంవత్సరాల గడిచిన తర్వాత 2023వ సంవత్సరం మే నెలలో అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా కొవిడ్-19కి ముగిసినట్లు టెడ్రోస్ ప్రకటించారు. కొవిడ్ వైరస్ పై నిఘా వేసి సీక్వెన్సింగ్ నిర్వహించాలని టెడ్రోస్ ప్రపంచ దేశాలకు సూచించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







