ఇండియన్ ఎంబసీలో ఘనంగా హిందీ దివస్
- January 12, 2024
కువైట్: కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం జనవరి 10న ఎంబసీ ఆడిటోరియంలో "ప్రపంచ హిందీ దివస్"ని జరుపుకుంది. కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైక ఈ వేడుకను ప్రారంభించారు. ఇందులో అన్ని భారతీయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హిందీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబాసిడర్ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ "హిందీ దివస్" సందేశాన్ని చదివి వినిపించారు. హిందీ దివాస్‌లో భాగంగా వ్యాస రచన, కవితా పఠనం, డిబేట్ వంటి వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లతో సత్కరించారు. ఇండియాలో జరిగిన CBSE నేషనల్ స్కూల్ గేమ్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కువైట్ విద్యార్థులను కూడా అంబాసిడర్ సత్కరించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







