నోల్ కార్డ్ స్కామ్.. హెచ్చరికలు జారీ చేసిన ఆర్టీఏ
- January 12, 2024
దుబాయ్: దుబాయ్‌లోని రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) నకిలీ నోల్ కార్డుల అమ్మకాలతో కూడిన మోసపూరిత మార్కెటింగ్ ప్రచారాల గురించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, నోల్ కార్డ్‌ల వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. తాజాగా RTA ప్లాట్‌ఫారమ్‌ను పోలిన మోసపూరిత వెబ్సైట్లు వారి స్మార్ట్ కార్డ్‌లను టాప్ అప్ చేయాలనుకునే వారిని మోసం చేసిన సంఘటనలు వెలుగులోకి రావడంతో ఆర్టీఏ అలెర్ట్ జారీ చేసింది. నోల్ కార్డ్‌ల వినియోగదారులు డిజిటల్ విధానాలను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈమేరకు తన ఎక్స్ అకౌంట్ లో ఓ పోస్ట్ ను షేర్ చేసింది. వెబ్సైట్ (rta.ae) టిక్కెట్ ఆఫీసులు, వెండింగ్ మెషీన్లు మరియు (RTA దుబాయ్, నోల్ పే) అప్లికేషన్ల వంటి RTA సేవలను మాత్రమే ఉపయోగించాలని సూచించింది. ఇటీవల దుబాయ్ నివాసి మొహమ్మద్ సల్మాన్.. తన నోల్ కార్డ్‌ని Dh10తో రీఛార్జ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అలాంటి ఒక మోసపూరిత వెబ్సైట్ ద్వారా Dh1,051 కోల్పోయాడు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







