వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి రాజీనామా..

- January 13, 2024 , by Maagulf
వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి రాజీనామా..

మచిలీపట్నం: వైసీపీకి, ఎంపీ పదవికి వల్లభనేని బాలశౌరి రాజీనామా చేశారు. ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు. బాలశౌరి కొంత కాలంగా నియోజకవర్గానికి, వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి వైసీపీ తరఫున వల్లభనేని బాలశౌరి పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే.

ఆ స్థానంలో ఇప్పుడు ఇతర నేతను నిలబెట్టాలని వైసీపీ భావిస్తోంది. తనకు సీటు దక్కదని తేలడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన మద్దతుదారులతో ఇప్పటికే ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. ఆయన టీడీపీలో చేరతారని కూడా ప్రచారం జరిగింది. చివరకు జనసేనలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. వైఎస్సార్ హయాం నుంచి బౌలశౌరి ఆ కుటుంబానికి సన్నిహితుడు. కొంత కాలంగా బాలశౌరికి, జగన్‌కు మధ్య అంతరం ఏర్పడింది.

ఇటీవలే వైసీపీకి, కర్నూలు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు సంజీవ్‌ కుమార్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కర్నూలు పార్లమెంట్‌ వైసీపీ ఇన్‌ఛార్జి పదవి నుంచి సంజీవ్‌ కుమార్‌ను తప్పించారు. దీంతో సంజీవ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఎన్నికలు సమీపిస్తుండడంతో వైసీపీ టికెట్ల విషయంలో తుది నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో అసంతృప్త నేతలు వేరే పార్టీల వైపునకు చూస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com