కువైట్‌, ఇరాన్‌ ఖైదీల మార్పిడి

- May 30, 2016 , by Maagulf
కువైట్‌, ఇరాన్‌ ఖైదీల మార్పిడి

కువైట్‌ ఇంటీరియర్‌ మినిస్ట్రీ, తమ జైళ్ళలో మగ్గుతున్న 47 మంది ఇరాన్‌కి చెందిన ఖైదీలను ఇరాన్‌కి అందించనున్నట్లు మినిస్ట్రీ వెల్లడించింది. ఇరు దేశాల మధ్యా కుదిరిన పలు ఒప్పందాల నేపథ్యంలో ఈ ఖైదీల బదిలీకి మార్గం సుగమం అయ్యింది. ఈ సందర్భంగా కువైట్‌ అధికారులు మాట్లాడుతూ, మానవ హక్కుల్ని కాపాడేందుకు కువైట్‌ ఎప్పుడూ ముందు వరసలో ఉంటుందని చెప్పారు. ఖైదీలు, ప్రత్యేకమైన క్యారియర్‌లో ఇరాన్‌కి పంపబడ్డారు. వారి కోసం స్వదేశంలో వారి బంధువులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. అంతర్జాతీయ బదిలీ ఒప్పందాల నేపథ్యంలో, కువైల్‌ జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను వారి వారి స్వదేశాలకు పంపుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com