యూఏఈలో కొత్త సిస్టం.. ట్రావెల్ బ్యాన్ ఎత్తివేత. ఫ్రోజెన్ ఫండ్స్ రిలీజ్
- January 16, 2024
యూఏఈ: ఇప్పుడు అన్ని న్యాయపరమైన అమలు నిర్ణయాలను తక్షణమే ట్రాక్ చేసేందుకు యూఏఈ కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. అబుదాబి జ్యుడీషియల్ డిపార్ట్‌మెంట్ చెల్లింపు స్థితిని ట్రాక్ చేసే కొత్త సిస్టమ్‌ను ప్రకటించింది. దీని ప్రకారం.. ప్రతివాది పేమెంట్ చేయగానే.. సంబంధిత అధికారులకు పంపబడుతుంది. దీంతో వ్యక్తులు స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేకుండానే వారిపై ఉన్న ఆదేశాలు రద్దవుతాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, న్యాయమూర్తుల జోక్యం లేకుండా ప్రక్రియ సజావుగా సాగుతుంది. గతంలో డ్యూస్ పేమెంట్ చేయని కారణంగా ప్రయాణ నిషేధం విధించబడిన సందర్భంలో ప్రతివాదులు స్మార్ట్ యాప్ ద్వారా రద్దు నిర్ణయం కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా చెల్లించని కారణంగా అరెస్ట్ వారెంట్ జారీ చేయబడిన సందర్భాల్లో లేదా నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైనందున డిపాజిట్లు, బ్యాంకు ఖాతాలపై ఏదైనా జప్తు ఉత్తర్వులు జారీ చేయబడితే, పేమెంట్ కాగానే అవి ఆటోమెటిక్ గా రద్దవుతాయి. ఈ కొత్త సిస్టమ్ అంతర్గతంగా నిర్మించిన డిజిటల్ సిస్టమ్ ద్వారా న్యాయమూర్తులు, అధికారులకు ఆటోమెటిక్ పద్ధతిలో తెలియజేస్తుంది. అలాగే ప్రతివాది కేసుపై తదుపరి చర్యలు, పర్యవేక్షణ గురించి అప్డేట్ అవుతుంది. ఈ విషయాన్ని సంబంధిత పార్టీలకు తెలియజేయబడుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







