'రుద్ర ఐపీఎస్'

- May 30, 2016 , by Maagulf
'రుద్ర ఐపీఎస్'

సమాజంలోని అక్రమాలను, అన్యాయాలను అరికట్టే పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రం 'రుద్ర ఐపీఎస్'. రాజ్‌కృష్ణ, కీర్తన జంటగా టి.కృష్ణవేణమ్మ సమర్పణలో బాలకృష్ణారెడ్డి దర్శకత్వంలో టి.రాజశేఖరరెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలుపుతూ -''సమాజంలోని చెడును ఓ పోలీసాఫీసర్ ఎలా ఎదిరించాడన్నదే కథ. రాజకీయ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్. స్క్రీన్‌ప్లే బేస్డ్ మూవీ. ఘంటాడి కృష్ణగారు మంచి పాటలు అందించారు'' అని చెప్పారు.''నిర్మాణరంగంలో ఉండే నేను సినిమాలపై ఆసక్తితో హీరోగా నటించి, ఈ చిత్రం నిర్మించా. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. జూన్‌లో సినిమాను రిలీజ్ చేస్తాం'' అన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com