రామమందిరం పై స్మారక పోస్టల్ స్టాంప్‌లను విడుదల చేసిన ప్రధాని మోడీ
- January 18, 2024
న్యూఢిల్లీ: శ్రీరామ జన్మభూమి ఆలయం పై రూపొందించిన స్మారక పోస్టల్ స్టాంప్‌లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు విడుదల చేశారు. దీంతోపాటు రాముడి చిత్రంతో కూడిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించారు. ప్రధాని మోడీ మొత్తం ఆరు తపాలా స్టాంపులను విడుదల చేశారు. వీటిలో రామాలయం, గణేశుడు, హనుమంతుడు, జటాయువు, కేవత్రాజ్, మా శబరి ఉన్నాయి. అదేవిధంగా స్టాంపులతో కూడిన పుస్తకాన్ని కూడా ప్రధాని ఆవిష్కరించారు. ఈ 48 పేజీల పుస్తకంలో యూఎస్, సింగపూర్, కెనడా, కంబోడియా సహా 20 కంటే ఎక్కువ దేశాలు విడుదల చేసిన పోస్టల్ స్టాంపులు ఉన్నాయి. స్టాంపుల విడుదల సందర్భంగా ప్రధాని దేశ ప్రజలకు సందేశం కూడా ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రధాన మోడీ మాట్లాడారు. ”నమస్కారం రామ్ రామ్.. ‘ఈ రోజు శ్రీరామమందిరం ప్రాణ ప్రతిష్టా అభియాన్ నిర్వహించిన మరో కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. శ్రీరామ జన్మభూమి మందిర్‌పై రూపొందించిన ఆరు స్మారక పోస్టల్ స్టాంప్స్, ఆల్బమ్ విడుదలైంది. దేశ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!