35 మందికి యావజ్జీవం : ఈజిప్ట్
- May 30, 2016
ఈజిప్ట్‌లోని నిషేధిత సంస్థ ముస్లిం బ్రదర్‌హుడ్ అధినేత మహ్మద్‌బడీ, మరో 35 మందికి ఇక్కడి కోర్టు యావజ్జీవిత జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. 2013లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన మోర్సీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు హింసకు పాల్పడినట్లు వీరిపై అభియోగాలు నమోదయిన విషయం తెలిసిందే. 2013 జులైలో ముగ్గురి హత్యకు దారి తీసిన ఈ హింసాకాండలో భాగస్వాములయ్యారన్న ఆరోపణలతో 49 మందికి 3 నుండి పదిహేనేళ్ల జైలుశిక్ష విధించారు. 9 మంది నిందితులకు 15 ఏళ్లు, 20 మందికి పదేళ్లు, మరో 20 మందికి మూడేళ్ల వంతున జైలుశిక్ష విధించారని కోర్టు అధికారులు చెప్పారు. సరైన ఆధారాలు లేవంటూ 20 మందిని కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. 2013 జులైలో ఇస్లామియా నగరంలో ముస్లిం బ్రదర్‌హుడ్ సభ్యులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయాలపాలయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







