బుర్జ్ అల్ అరబ్‌లో అరుదైన కార్పెట్ల ప్రదర్శన
- January 22, 2024
దుబాయ్: Dh10 మిలియన్ల విలువైన చేతితో తయారు చేసిన పురాతన పర్షియన్ కార్పెట్ దుబాయ్‌లోని అత్యంత ఖరీదైన కార్పెట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ కళాఖండాన్ని ప్రస్తుతం ఐకానిక్ బుర్జ్ అల్ అరబ్ హోటల్లో ప్రదర్శిస్తున్నారు. మూడు రోజుల ఈవెంట్ హెరిటేజ్ కార్పెట్ ల అరుదైన కలెక్షన్లను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతమైన ప్రీమియం, హ్యాండ్‌క్రాఫ్ట్ కార్పెట్లను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు హెరిటేజ్ కార్పెట్ వైస్ చైర్మన్ అఫ్షిన్ ఘన్బరినియా పేర్కొన్నారు. Dh10-మిలియన్ కార్పెట్ ప్రత్యేక ఆర్డర్‌తో తయారు చేయబడిందని తెలిపారు. ఈ కార్పెట్ వందల సంవత్సరాల నాటిదని, దాని పరిమాణం, డిజైన్, వినియోగించిన రంగులు అసాధారణంగా ఉన్నాయన్నారు. నాణ్యమైన గొర్రెల ఉన్నితో వీటిని తయారు చేస్తారని, పర్షియన్ కార్పెట్ లకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉందన్నారు. ఖరీదైన కార్పెట్ లను రాజకుటుంబాలు కొంటాయని వివరించారు. కొన్ని పెర్షియన్ తివాచీలు ఉన్ని మరియు పట్టుతో రూపొందించబడ్డాయన్నారు. వీటిని ప్రత్యే కథనాలతో రూపొందిస్తారని తెలిపారు. ఘన్బరినియా కుటుంబం 1841లో కార్పెట్ విక్రయ వ్యాపారాన్ని ప్రారంభించింది. గత నాలుగు దశాబ్దాల క్రితం దుబాయ్‌లో దుకాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం హెరిటేజ్ కార్పెట్ 30 దేశాలలో 85 షోరూమ్‌లను కలిగిఉంది.
తాజా వార్తలు
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!*
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!
- ప్రశాంతమైన రమదాన్ కోసం దుబాయ్ పోలీసుల అడుగులు
- జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం..
- గ్లోబల్ విలేజ్‌లో ఈద్ బాణాసంచా వేడుకలు రద్దు..
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!









