రోడ్డు ప్రమాదాలు తగ్గించాలి: డీజీపీ రవి గుప్తా

- January 23, 2024 , by Maagulf
రోడ్డు ప్రమాదాలు తగ్గించాలి: డీజీపీ రవి గుప్తా

హైదరాబాద్: అధికారులు సమన్వయంతో రోడ్డు ప్రమాదాల తగ్గుదలకు చర్యలు తీసుకోవాలని డీజీపీ రవి గుప్తా ఆదేశించారు. 2023 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల పై డీజీపీ రవి గుప్తా మంగళవారం పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

గత సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ఎస్పీ సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో 203 సంవత్సరంలో మొత్తం 35 రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పారు. ఆసిఫాబాద్‌ డివిజన్‌లో 66, కాగజ్‌నగర్‌ డిఇజన్‌లో 69 ప్రమాదాలు సంభవించాయని వివరించారు. ఇందులో తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు 57, సాధారణ ప్రమాదాలు 56, మరణానికి గురైన ప్రమాదాలు, ప్రమాదం జరిగిన ఎలాంటి తీవ్రతకు గురి కాని సంఘటన నమోదు అయినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని, జిల్లాలో రోడ్డు ప్రమాద నివారణ అవగాహన కార్యక్రమాలు చేపడడుతున్నట్లుగా ఎస్పీ తెలిపారు. కార్యక్ర మంలో జిల్లా అదనపు ఎస్పీ అచ్చేశ్వర్‌రావు, డీఎస్పీ కరుణాకర్‌, డీసీఆర్‌బీ డీఎస్పీ రమేష్‌, స్పెషల్‌ బ్రాంచి ఇన్స్‌పెక్టర్‌ రాణా ప్రతాప్‌, డీసీఆర్బీ ఇన్స్‌పెక్టర్‌ రమేశ్‌ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com