రోడ్డు ప్రమాదాలు తగ్గించాలి: డీజీపీ రవి గుప్తా
- January 23, 2024
హైదరాబాద్: అధికారులు సమన్వయంతో రోడ్డు ప్రమాదాల తగ్గుదలకు చర్యలు తీసుకోవాలని డీజీపీ రవి గుప్తా ఆదేశించారు. 2023 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల పై డీజీపీ రవి గుప్తా మంగళవారం పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గత సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ఎస్పీ సురేష్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 203 సంవత్సరంలో మొత్తం 35 రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పారు. ఆసిఫాబాద్ డివిజన్లో 66, కాగజ్‌నగర్ డిఇజన్లో 69 ప్రమాదాలు సంభవించాయని వివరించారు. ఇందులో తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు 57, సాధారణ ప్రమాదాలు 56, మరణానికి గురైన ప్రమాదాలు, ప్రమాదం జరిగిన ఎలాంటి తీవ్రతకు గురి కాని సంఘటన నమోదు అయినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని, జిల్లాలో రోడ్డు ప్రమాద నివారణ అవగాహన కార్యక్రమాలు చేపడడుతున్నట్లుగా ఎస్పీ తెలిపారు. కార్యక్ర మంలో జిల్లా అదనపు ఎస్పీ అచ్చేశ్వర్రావు, డీఎస్పీ కరుణాకర్, డీసీఆర్బీ డీఎస్పీ రమేష్, స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేశ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు







