దుబాయ్ విద్యార్థులకు 3 వారాలపాటు సెలవులు!
- January 24, 2024
యూఏఈ: చాలా మంది విద్యార్థులు మార్చిలో పవిత్ర రమదాన్ మాసంతో పాటు మూడు వారాల సుదీర్ఘ సెలవులను పొందనున్నారు. ఆ తర్వాత ఈద్ అల్ ఫితర్ సెలవులు ఉంటాయి. ఇదే సమయంలో అకాడమిక్ ముగింపు సెలవులు కూడా వస్తాయి. దుబాయ్ ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఛారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్‌మెంట్ (IACAD) వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన హిజ్రీ క్యాలెండర్ ప్రకారం.. రమదాన్ మార్చి 12, 2024 మంగళవారం ప్రారంభమవుతుంది. దుబాయ్ నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KHDA) వెబ్‌సైట్ ప్రకారం..దుబాయ్‌లోని ప్రైవేట్ పాఠశాలలు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయి. మార్చి 25 నుండి ఏప్రిల్ 15 వరకు సెలవులు ఉంటాయి. ఈద్ అల్ ఫితర్ పండుగ కారణంగా రెండు వారాల సెలవులతో పాటు కంటే అదనంగా వారం పాటు పొడిగించిన సెలవులు రావచ్చు. అయితే, ఇది చంద్రుని వీక్షణపై ఆధారపడి ఉంటుంది. గల్ఫ్ ఇండియన్ హైస్కూల్ దుబాయ్ ప్రిన్సిపాల్ మహమ్మదాలీ కొట్టాకులం మాట్లాడుతూ. "మా వార్షిక పరీక్షలు మార్చి 14 నాటికి ముగియవలసి ఉంది. కొత్త విద్యా సంవత్సరం 2024-25 ఏప్రిల్ 1, 2024 నుండి ప్రారంభమవుతుంది.”అని తెలిపారు.
తాజా వార్తలు
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్







