‘నేను ప్రతిదీ కోల్పోయాను': Dh200,000 కోల్పోయిన బాధితురాలి ఆవేదన
- January 24, 2024
యూఏఈ: పోర్చుగీస్ కు చెందిన ఓ మహిళ గత నాలుగు సంవత్సరాలుగా దుబాయ్ లో ఉంటున్నారు. ఇటీవల తన జీవిత పొదుపు దాదాపు Dh200,000 ఫోన్ స్కామర్ల వల్ల కోల్పోయింది. " మోసపోయిన తర్వాత నేను జీవితాన్ని కోల్పోయినట్లు అన్పించింది." అని ఆమె మీడియాతో పేర్కొన్నారు. సాధారణంగా తాను తెలియని నంబర్ నుండి కాల్ తీయనని చెప్పారు. కానీ ఆ సమయంలో తన ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నానని, అదే కారణంతో ఫోన్ ఎత్తినట్లు తెలిపారు. Dh150,000 బహుమతిని గెలుచుకున్నట్లు స్కామర్లు వివరించడంతో కాల్ ప్రారంభమైందనీ వివరించారు. ఆమె ముందు రోజు సదరు ఎక్స్ఛేంజ్ హౌస్‌ను సందర్శించినందువల్ల వారు ఆమె బ్యాంక్ యాప్‌ని తాజా ENBD X యాప్‌కి అప్డేట్ చేయమని చెప్పినట్లు.. ఆమె బహుమతిని క్లెయిమ్ చేయడానికి ఇది అవసరమని భావించింది. ఈ ప్రక్రియలో ఆమె తన లాగిన్ వివరాలను, యాప్ కోసం పాస్‌వర్డ్‌ను స్కామర్లకు తెలిపింది. కానీ ఆ సమయంలో తాను దాదాపు హిప్నోటైజ్ అయినట్లే అనిపించిందని పేర్కొంది. తరువాతి 24 నిమిషాల వ్యవధిలో తన ఖాతా ఖాళీ అయిందని తెలిపారు. తనక డబ్బు పోయిందని గ్రహించే లోపే అంతా అయిపోయింది. ఆపై బ్యాంకుకు..పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన డబ్బు తిరిగి వస్తుందనే ఆశ లేనప్పటికీ తన కథ ఇతరులకు గుణ పాఠంగా ఉంటుందనీ కోరుకుంటునట్లు ఆమె వివారించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







