ప్రైవేట్ రంగంలో ఏడు గంటల పనివేళలు!

- January 25, 2024 , by Maagulf
ప్రైవేట్ రంగంలో ఏడు గంటల పనివేళలు!

కువైట్: కువైట్ పార్లమెంటేరియన్లు ప్రైవేట్ రంగంలో వారపు పని గంటలను నలభై రెండు గంటలు లేదా రోజుకు ఏడు గంటలకు పరిమితం చేయాలనే ప్రతిపాదనను తీసుకొచ్చారు. తెహ్ ప్రతిపాదనను ఎంపీలు బదర్ నష్మీ, ఫారిస్ అల్-ఒతైబి, అబ్దుల్ హదీ అల్-అజ్మీ, బదర్ సయ్యర్ మరియు ఒసామా అల్-షాహీన్ బలపరినట్లు సమాచారం. పవిత్ర రమదాన్ మాసంలో వారపు పని గంటలు ముప్పై ఆరు గంటలకు పరిమితం చేయబడతాయని  ప్రతిపాదనలో పేర్కొన్నారు. దీంతోపాటు నాలుగు గంటల పని తర్వాత.. ఒక గంట విశ్రాంతి వ్యవధిని ఇవ్వాలని కూడా ప్రతిపాదనలో సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com