‘హనుమాన్’ పాత్రలో కనిపించబోయేది ఆ నటుడేనా.?

- January 27, 2024 , by Maagulf

సంక్రాంతికి వచ్చిన ‘హనుమాన్’ సినిమా ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇదే ఊపులో ‘హనుమాన్’ సీక్వెల్ కూడా స్టార్ట్ చేసేశాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
సీక్వెల్‌కి ‘జై హనుమాన్’ అనే టైటిల్ ఆల్రెడీ ‘హనుమాన్’ సినిమా క్లైమాక్స్‌లోనే ప్రకటించేశాడు.
అయితే, ఇప్పుడు హనుమాన్ పాత్రలో నటించబోయేదెవరు.? అనేదే అందరిలోనూ ఉత్కంఠగా నడుస్తోంది. ఓ స్టార్ హీరో ఈ సినిమాలో నటించబోతున్నాడు.. అదీ హనుమాన్ పాత్రలో అని ఇప్పటికే ప్రశాంత్ వర్మ చెప్పేశాడు.
దాంతో, ‘హనుమాన్’ సిరీస్‌పై అంచనాలు పెరిగిపోయాయ్. ఇక, ఇప్పుడు ఆ పాత్ర పోషించగలిగే స్టార్ హీరో ఎవరు.? అనేదే అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.
హనుమంతుడు పాత్ర అంటే.. భారీ కటౌట్ వుండాలి. స్టార్ హీరోల్లో ఆ స్థాయిలో కటౌట్ మరియు ఆ తరహా ఆటిట్యూడ్ ఎవరికి వుంది.? చిరంజీవి చేయలేనని చెప్పేశారు.
మిగిలిన స్టార్ హీరోలను ఊహించుకోలేం. అయితే, విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న రానా పేరు ఒకింత వినిపిస్తోంది. కన్నడ స్టార్ హీరో అయిన యష్ పేరు కూడా వినిపిస్తోంది. అన్నట్లు ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి పేరు కూడా ఈ లిస్టులో వుంది. ఏమో చూడాలి మరి, ఎవరు ఈ పాత్రకు ఫిట్ అవుతారో.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com