సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న 'ఒక్క అమ్మాయి తప్ప'

- May 31, 2016 , by Maagulf
సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న 'ఒక్క అమ్మాయి తప్ప'

సందీప్‌ కిషన్‌, నిత్యా మేనన్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప'. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు నుంచి 'యూ' సర్టిఫికెట్‌ లభించినట్లు హీరో సందీప్‌ కిషన్‌ సోషల్‌మీడియా ద్వారా తెలిపారు.
ఈ సందర్భంగా సరికొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే ముందు.. వేసవి చివరిలో వచ్చే చిత్రమని ట్వీట్‌ చేశారు. రాజసింహ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అంజిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె. మేయర్‌ సంగీతం సమకూర్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com