దుబాయ్ లైట్ ఫెస్టివల్.. ఆకట్టుకుంటున్న లైట్ ఆర్ట్ ఇన్స్టాలేషన్లు!
- January 28, 2024
దుబాయ్: ఎక్స్పో సిటీలోని ధై దుబాయ్ లైట్ ఆర్ట్ ఫెస్టివల్లో దుబాయ్ నివాసితులు ఉత్కంఠభరితమైన లైట్ ఆర్ట్ ఇన్స్టాలేషన్లను ఆస్వాదిస్తున్నారు. మొత్తం ఏడుగురు కళాకారులు, ఈవెంట్ క్యూరేటర్లు కలిసి యూఏఈ సంస్కృతి గురించి సమిష్టిగా చెప్పే కళాఖండాలను ఆవిష్కరించారు. ఈ తరహా మొదటి లైట్ ఆర్ట్ ఫెస్టివల్ శుక్రవారం ప్రారంభం అయింది. ఫిబ్రవరి 4 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఇంటరాక్టివ్ సెషన్లు, చర్చలు, వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తున్నారు. లైట్ ఇన్స్టాలేషన్లతో పాటు ఎక్స్‌పోలో ఉన్న అనేక ఇతర ఇన్స్టాగ్రామ్ స్పాట్లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. మైతా హమ్దాన్ ఆర్ట్ పీస్ ఆఫ్టర్ లైఫ్ పేరుతో కళాకృతిని రూపొందించారు. ఎమిరాటీ కాలిగ్రాఫర్ మత్తర్ బిన్ లాహెజ్ లైట్ ఆర్ట్ పీస్ ఒక కళాఖండాన్ని సృష్టించాడు. రోజువారీ ప్రార్థనల లయతో ప్రేరణ పొందిన అబ్దుల్లా అల్ముల్లా తన కళాకృతి మినారెట్ 2.0ను రూపొందించారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్‌నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









