ముగిసిన అల్ మౌజ్ మస్కట్ మారథాన్-2024

- January 28, 2024 , by Maagulf
ముగిసిన అల్ మౌజ్ మస్కట్ మారథాన్-2024

మస్కట్: అల్ మౌజ్ మస్కట్ మారథాన్ -2024 పోటీలు జనవరి 27న ముగిశాయి.  ఇందులో ఒమన్ సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో నివసిస్తున్న ఒమానీ , విదేశీ అథ్లెట్లు పాల్గొన్నారు. 5 కి.మీ మారథాన్ పోటీల్లో అబ్దుల్లా అల్ ఖురైనీ ప్రథమ స్థానం, సేలం అల్ రషీది ద్వితీయ స్థానం సాధించగా.. తృతీయ స్థానంలో నాసర్ అల్ నబీ నిలిచారు. 3 కి.మీల పోటీలో విస్సామ్ అల్ మహరమి ప్రథమ స్థానం పొందారు. షాహీన్ గౌరీ ద్వితీయ స్థానం, జైద్ అల్ ధామ్రీ తృతీయ స్థానంలో నిలిచారు. 2 కిలోమీటర్ల పోటీలో తుర్కీ అల్‌-సుదైరి ప్రథమ స్థానం, ద్వితీయ స్థానంలో అవ్స్‌ అల్‌ ఫహదీ, తృతీయ స్థానంలో మాలిక్‌ అహ్మద్‌ నిలిచారు.  చిన్నారుల కోసం జరిగిన 1 కిలోమీటరు పోటీలో తారిఖ్ బీరకదర్ ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం మిషారీ అల్ బలూషి, తృతీయ స్థానంలో ఒసామా అల్ బహ్రీ నిలిచారు. SABCO స్పోర్ట్స్ కంపెనీ (అల్ మౌజ్ మస్కట్ మారథాన్ ఆర్గనైజింగ్ కంపెనీ) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ ఖలీద్ బిన్ హమద్ అల్ బుసైది మాట్లాడుతూ..  ఒమన్ సుల్తానేట్ లో అల్ మౌజ్ మస్కట్ మారథాన్ అతిపెద్ద ఈవెంట్ అని అన్నారు. ఇది ప్రపంచ అథ్లెటిక్స్ ఫెడరేషన్లచే కూడా గుర్తింపు పొందిందని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com