సీఫ్ మాల్‌లో అరడోస్ కాయిన్ ఎగ్జిబిషన్ ప్రారంభం
- January 28, 2024
బహ్రెయిన్: మనామాలోని సీఫ్ మాల్‌లో ప్రఖ్యాత అరడోస్ కాయిన్ ఎగ్జిబిషన్, వేలం ఆరవ ఎడిషన్ ప్రారంభం అయింది. దీనిని యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ హిస్ ఎక్సలెన్సీ మర్వాన్ ఫౌద్ కమల్ అధికారికంగా ప్రారంభించారు. ఈ ఈవెంట్‌కు 14 దేశాల వారు పాల్గొంటున్నారు. ఉమయ్యద్ మరియు సస్సానిద్ నాణేలు, ఇరాక్ రాజు ఫైసల్ I నాణేలు, అలాగే అరుదైన గల్ఫ్ నాణేలు మరియు 1780 నాటి ఎంప్రెస్ థెరిసా ఆఫ్ ఆస్ట్రియా నాణేలతో సహా అరుదైన చారిత్రక కరెన్సీల ఆకర్షణీయమైన శ్రేణిని కలిగి ఉన్న ప్రదర్శనను అండర్ సెక్రటరీ అబ్బాసిద్ తిలకించారు. ప్రపంచ సంస్కృతులను అర్థం చేసుకోవడానికి ఇవి దోహదం చేస్తాయన్నారు. యువతకు వారి అభిరుచులలో మద్దతు ఇవ్వడంలో.. ప్రోత్సహించడంలో ఎగ్జిబిషన్ కీలక పాత్రను పోషిస్తుందని తెలిపారు. అరుదైన కరెన్సీలను ప్రదర్శించడానికి, మార్కెట్ చేయడానికి ఇది వేదికగా నిలుస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







