ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
- February 01, 2024
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ చేత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్ కారుదిగి నమ్మెదిగా నడుచుకుంటూ తన చాంబర్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ వెంట బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనాచారి, మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కేసీఆర్ తన చాంబర్ లో ప్రత్యేక పూజల అనంతరం స్పీకర్ కార్యాలయంకు వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ వెంటనే ప్రమాదవ శాత్తూ కేసీఆర్ గాయపడటంతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం ఆరు నుంచి ఎనిమిది వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయన రెండు నెలలుపాటు గజ్వేల్ వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడు కర్ర సాయంతో వైద్యుల పర్యవేక్షణలో నెమ్మదిగా నడుస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో కేసీఆర్ అసెంబ్లీకి చేరుకొని, శాసనసభాపక్ష నేతగా ఆయనకు కేటాయించిన చాంబర్ లో కేసీఆర్ ముందుగా పూజలు చేశారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్ కు చేరుకొని మధ్యాహ్నం 12.40 గంటలకు కేసీఆర్ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు.
ఓటమి ఎరుగని నేత ..
కేసీఆర్ 1985 నుంచి 1999 వరకు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2001లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కేసీఆర్.. మరోసారి సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
తెలంగాణ ఉద్యమ ప్రభావంతో 2004 ఎన్నికల్లో సిద్ధిపేట ఎమ్మెల్యేతో పాటు కరీంనగర్ ఎంపీగా పోటీ చేశారు. రెండు చోట్ల విజయం సాధించడంతో కేసీఆర్ ఎంపీగా కొనసాగారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
2009 ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ విజయం సాధించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్ విజయం సాధిస్తూ వచ్చారు. గజ్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కేసీఆర్ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలిరానున్నారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణం వద్ద భద్రతను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







