రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్లు మంజూరు: సీఎం రేవంత్
- February 02, 2024
హైదరాబాద్: తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,190 కోట్లును మంజూరు చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున మంజూరు చేసింది. జిల్లా ఇంచార్జి మంత్రుల ఆమోదంతో అభివృద్ధి పనులు చేపట్టాలని జీవోలో పేర్కొంది. ప్రతి నియోజకవర్గంలో విద్యాసంస్థలకు రూ. 2 కోట్లు, మంచినీటికి రూ.కోటి చొప్పున మంజూరు చేసినట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. నియోజకవర్గానికి రూ. 50 లక్షల చొప్పున మండల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయాల కార్యాలయాల మెయింటెనెన్స్ కోసం వెచ్చించాలని పేర్కొంది. జిల్లాల ఇన్ ఛార్జి మంత్రుల ఆమోదంతోనే ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంది.
కరీంనగర్ జిల్లా రూ. 130 కోట్లు కేటాయించగా అందులో రూ. 26 కోట్లు ప్రాథమిక విద్యా సదుపాయాలు, రూ. 13 కోట్లు తాగునీటి సౌకర్యం, రూ. 6.50 లక్షలు ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించారు. మహబూబ్ నగర్ రూ. 140 కోట్లు, ఖమ్మం రూ. 100, రంగారెడ్డి రూ. 140, వరంగల్ రూ.120, హైదరాబాద్ రూ. 15 మెదక్ రూ. 100 కోట్లు, ఆదిలాబాద్ 100 కోట్లు, నల్గొండ రూ. 120 కోట్లు, నిజామాబాద్ రూ. 90 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







