ఆర్ధిక ప్రణాళిక, పన్నులపై NATS సెమీనార్
- February 05, 2024
అమెరికా: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూజెర్సీ ఎడిసన్‌లో ఆర్ధికాంశాల పై అవగాహన కల్పించేందుకు ఆర్ధిక సదస్సు నిర్వహించింది. న్యూజెర్సీలో ఆర్ధిక ప్రముఖుడు ఏజీ ఫిన్‌టాక్స్ వ్యవస్థాపకులు అనిల్ గ్రంథి ఈ సదస్సులో తెలుగువారికి ఆర్ధిక అవగాహన కల్పించారు.ముఖ్యంగా 2023 టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్, 2024 ఆర్ధిక ప్రణాళిక ఎలా ఉండాలనేది వివరించారు.రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులకు వచ్చే పన్ను ప్రయోజనాలు, ఎలక్ట్రానిక్ వాహనాలకు టాక్స్ క్రెడిట్ రూల్స్ ఇలాంటి ఎన్నో అంశాలపై సమగ్ర అవగహన వచ్చేలా ఈ ఆర్ధిక సదస్సు సాగింది. క్యాపిటల్ గైన్ ట్యాక్స్‌లను ఎలా తగ్గించుకోవాలి..? వ్యాపారస్తులు, ఉద్యోగులు పన్నులు, ఆర్ధికాంశాల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలనేది అనిల్ గ్రంథి చక్కగా వివరించారు.దాదాపు 200 మందికిపైగా తెలుగువారు ఈ సదస్సుకు విచ్చేశారు. పేస్ బుక్ లైవ్ లో కూడా చాలా మంది వీక్షించి తమ సందేహాలను అనిల్ గ్రంథిని అడిగి నివృత్తి చేసుకున్నారు. అమెరికాలో ఆర్ధిక అంశాలపై ఇంత ఉపయుక్తమైన సదస్సును నిర్వహించడం పట్ల ఈ సదస్సుకు విచ్చేసిన తెలుగు వారంతా హర్షం వ్యక్తం చేశారు.నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీహరి మందాడి ఈ సదస్సు నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.నాట్స్ బోర్డ్ డైరెక్టర్స్, న్యూ జెర్సీ నాట్స్ విభాగ నాయకులు శ్యామ్ నాళం, టి.పి. రావు, బిందు యలమంచిలి, మురళీ కృష్ణ మేడిచెర్ల, సురేష్ బొల్లు, బస్వ శేఖర్ శంషాబాద్, మోహన్ కుమార్ వెనిగళ్ల, దేసు గంగాధర్, రమేష్ నూతలపాటి,చంద్రశేఖర్ కొణిదెల,వంశీకృష్ణ వెనిగళ్ల, చక్రధర్ వోలేటి, డా.సూర్యం గంటి తదితరులు, వాలంటీర్లు ఈ సదస్సు విజయవంతానికి తమ వంతు సహకారం అందించారు.
స్థానిక జై స్వరాజ్ టీవీ, యూ బ్లడ్ అధినేత జగదీష్ ఎలమంచిలి ఈ కార్యక్రమానికి తమ కార్యాలయం లో ఈ కార్యక్రమం జరిగింది.మాజీ చైర్ వుమన్ అరుణ గంటి కూడా సరైన టాక్స్ సమయంలో ఈ కార్యక్రమం చేసినందుకు టీం సభ్యులందరికీ అభినందనలు తెలియచేసారు.
ఆర్థిక అంశాలపై ఇంత చక్కటి సదస్సును నిర్వహించటంలో సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ అధ్యక్షుడు బాపయ్య (బాపు)నూతి, నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







