‘ఈగల్’ అయినా మాస్ రాజాని కాపాడుతుందా.?
- February 05, 2024
‘ధమాకా’తో హిట్టు కొట్టి ఫామ్‌లోకి వచ్చిన మాస్ రాజా రవితేజకి ఆ ఫామ్ కంటిన్యూ చేయడం సాధ్యపడలేదు. ‘వాల్తేర్ వీరయ్య’తో కంటిన్యూ చేశాడనుకున్నప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ బోల్తా కొట్టేశాడు.
‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు మాస్ రాజాని డైలమాలో పడేశాయ్. దాంతో, ‘ఈగల్’ పైనే రవితేజ ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ నెల 9న సోలోగా రవితేజ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
సంక్రాంతి సినిమాల తర్వాత దాదాపు రెండు మూడు వారాల తర్వాత ధియేటర్లలో సందడి చేయబోయే సినిమా ఇది. ‘హనుమాన్’ మేనియాతో ధియేటర్లు దద్దరిల్లాయ్.
ఆ మేనియా నుంచి కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా ‘ఈగల్’. ఇద్దరు ముద్దుగుమ్మలు అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ గ్లామర్ ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ కానుంది.
కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరెక్కుతోన్న ఈ సినిమా విజయం రవితేజ కెరీర్‌ని ఎలాంటి మలుపు తిప్పనుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







