దోహా జ్యువెలరీ & వాచెస్ ఎగ్జిబిషన్ ప్రారంభం
- February 06, 2024
దోహా: దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (DECC)లో 20వ ఎడిషన్ దోహా జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. దీనిని ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి హెచ్ఇ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ ప్రారంభించారు. ప్రారంభ వేడుకల్లో అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఖలీఫా బిన్ హమద్ అల్ థానీ, ఖతార్ టూరిజం చైర్మన్ హెచ్ఈ సాద్ బిన్ అలీ అల్ ఖర్జీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 11 వరకు జరిగే ఈవెంట్లో 10 దేశాలకు చెందిన 500 బ్రాండ్లు పాల్గొంటున్నాయి.
జనవరి నెలలో ఇప్పటికే 700,000 మంది సందర్శకులు వచ్చారని, రాబోయే రోజుల్లో మరింత మంది వచ్చే అవకాశం ఉందని ఖతార్ టూరిజం వెల్లడించింది. "గత రెండు దశాబ్దాలుగా జరుగుతున్న ఎగ్జిబిషన్.. స్థానిక, ప్రాంతీయ మరియు ప్రపంచ స్థాయిలలో లగ్జరీ, అధునాతనతకు చిహ్నంగా ఉంది. ఎగ్జిబిషన్ యొక్క నిరంతర విజయం పర్యాటక రంగం యొక్క పెరిగిన వేగానికి అనుగుణంగా ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో మేము రికార్డు స్థాయిలో సందర్శకుల సంఖ్యను నమోదు చేసాము." అని ఖతార్ టూరిజం తెలిపింది. భారతీయ, టర్కిష్ మరియు ఖతారీ డిజైనర్లకు ప్రాతినిధ్యం వహించే మూడు విభిన్నమైన పెవిలియన్లను ఏర్పాటు చేశారు. ఖతారీ డిజైనర్స్ పెవిలియన్లో అల్ ఘలా జ్యువెలరీ, డి త్రోవ్, ఘండ్ జ్యువెలరీ, హెచ్ జ్యువెలరీ, కల్తామ్ పెవిలియన్, మిడాద్ జ్యువెలరీ, నౌఫ్ జ్యువెలరీ, థమీన్ జువెలరీ, ట్రిఫోగ్లియో మరియు డి డబ్ల్యూ జ్యువెలరీలతో సహా 10 ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం "బిగ్ 8"లో అల్ఫర్డాన్ జ్యువెలరీ, అల్ మజేద్ జ్యువెలరీ, అలీ బిన్ అలీ లగ్జరీ, అమిరి జెమ్స్, ఫిఫ్టీ వన్ ఈస్ట్, అల్ ముఫ్తా జ్యువెలరీ, బ్లూ సెలూన్ మరియు బీవీఎల్డరీ (BVLGARI) ఉన్నాయి. ఎగ్జిబిషన్ ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది విజిట్ ఖతార్ వెబ్సైట్ ద్వారా బుకింగ్ లను నమోదు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం







