భారతీయులకు యూఏఈ వీసా-అరైవల్: 14 రోజుల అనుమతిని పొడిగించవచ్చా?
- February 06, 2024
యూఏఈ: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ ద్వారా దుబాయ్‌కి ప్రయాణించే కొంతమంది భారతీయులకు ముందుగా ఆమోదించిన వీసా-ఆన్-అరైవల్ సందర్శన సమయంలో ఒకసారి మాత్రమే పొడిగించబడుతుంది. వీసా కోసం దరఖాస్తులను ప్రాసెస్ చేసే VFS గ్లోబల్, దుబాయ్ ఎయిర్పోర్ట్ ఫ్రీ జోన్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) కార్యాలయంలో పొడిగింపును చేసుకోవచ్చు. అమెరికా వీసా లేదా గ్రీన్ కార్డ్ ఉన్న భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్ల కోసం 14-రోజుల సింగిల్-ఎంట్రీ వీసాగా జారీ చేస్తారు. కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటు అయ్యే ఈయూ లేదా యూకే రెసిడెన్సీ ఉన్న వారికి మాత్రమే ఈ సదుపాయం అమల్లో ఉంది. ఇందుకోసంధర $69 (Dh250) నిర్ణయించారు. Dh250 చెల్లించడం ద్వారా వీసాను మరో 14 రోజులు పొడిగించుకునే అవకాశం ఉందని వీఎఫ్ఎస్ అధికార వర్గాలు తెలిపాయి. అర్హత గల ప్రయాణికులకు 2017 నుండి యూఏఈ విమానాశ్రయాలలో వీసా-ఆన్-అరైవల్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు.
ప్రయాణికులు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు?
ప్రయాణీకులు ముందుగా ఆమోదించబడిన యూఏఈ వీసా కోసం "60 రోజుల కంటే ఎక్కువ మరియు దుబాయ్‌కి వచ్చే తేదీకి రెండు రోజుల కంటే తక్కువ కాకుండా" దరఖాస్తు చేసుకోవచ్చు. వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ టైమ్లైన్లు ఎమిరేట్స్ సెట్ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి.
ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత ఉన్న భారతీయులు ముందుగా ఎమిరేట్స్‌లో ఫ్లైట్ బుక్ చేసుకోవాలి. వారు ఎయిర్‌లైన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తమ బుకింగ్‌ను తిరిగి పొందవచ్చు. VFS గ్లోబల్ సర్వీసెస్ ద్వారా ఆధారితమైన ఆన్లైన్ యూఏఈ వీసా అప్లికేషన్ సైట్‌కి డైరెక్ట్ అవుతుంది. అనంతరం ధృవీకరించబడిన ఎమిరేట్స్ రిటర్న్/ఆన్వర్డ్స్ టికెట్, భారతీయ పాస్‌పోర్ట్ (కనీసం ఆరు నెలల వరకు చెల్లుబాటు అవుతుంది), చెల్లుబాటు అయ్యే అమెరికా వీసా (కనీసం 6 నెలల చెల్లుబాటు)/గ్రీన్ కార్డ్/చెల్లుబాటు అయ్యే యూకే/ఈయూ రెసిడెన్సీ డాక్యుమెంట్స్ ను అటాచ్ చేయాలని ఎమిరేట్స్ తెలిపింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







