‘కల్కి’ విషయంలో తగ్గేదే లే.!
- February 06, 2024
ప్రబాస్ ప్రెస్టీజియస్ మూవీస్‌లో ఒకటైన ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్‌కి సంబంధించి తాజాగా అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాని మొదట రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామన్నారు. అది కాస్తా ఇప్పుడు మూడు పార్టులు అంటున్నారు.
అయితే, మొదటి పార్ట్ షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం. ప్రస్తుతం రెండో పార్ట్ షూటింగ్ కోసం సర్వం సిద్ధం చేశారట. ఈ నెలలోనే పార్ట్ 2 షూట్ వర్క్ కూడా ప్లాన్ చేస్తారనీ తెలుస్తోంది.
ఇక, సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో ప్రకటించేశారు. మే 9 కల్లా ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నదే చిత్ర యూనిట్ వుద్దేశ్యం. ఇంతవరకూ ప్రబాస్ సినిమాలంటే.. వాయిదాల పర్వమే. కానీ, ‘కల్కి’ మొదటి పార్ట్ అనుకున్న డేట్‌కే రిలీజ్ చేయడం పక్కా అని తెలుస్తోంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ మూవీగా ‘కల్కి’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొనె, దిశా పటానీ, బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్ పవర్ ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!







