‘యాత్ర 2’ రిలీజ్‌కి సిద్ధం.! అంచనాలెలా వున్నాయంటే.!
- February 06, 2024
గతంలో రిలీజైన ‘యాత్ర’ సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న సినిమానే ‘యాత్ర 2’. మహి.వి.రాఘవ ఈ సినిమాని తెరకెక్కించారు. మొదటి పార్ట్ దివంగత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కించారు.
ఆయన పాదయాత్ర కీలకంగా ఆ సినిమా సాగింది. ముమ్ముట్టి లీడ్ రోల్ పోషించారు. ఆ సినిమాకి రెస్పాన్స్ ఓ మోస్తరుగానే వచ్చింది కానీ, ఇప్పుడు రూపొందిన ‘యాత్ర 2’ మొత్తం ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవిత గాధ ఆధారంగా రూపొందించారు.
వైఎస్ జగన్‌పై ప్రస్తుతం జనంలో చాలా నెగిటివిటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాని రిలీజ్ చేయడం ఎంతవరకూ సబబు.? అయితే, పొలిటికల్ హీట్ బాగా వున్న ఈ నేపథ్యమే.. రైట్ టైమ్ అనుకున్నారో ఏమో.. సినిమా రిలీజ్‌కి సర్వం సిద్ధం చేశారు.
ఫిబ్రవరి 8న ‘యాత్ర 2’ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. జీవ ఈ సినిమాలో జగన్ మోహన్ రెడ్డి పాత్ర పోషించారు. పెద్దగా అంచనాల్లేవ్. కానీ, మహి. వి. రాఘవ మంచి విషయమున్న డైరెక్టర్. వైఎస్ జగన్ జీవితానికి సంబంధించి తెరపై తెలియని విషయాలేం ఆవిష్కరించాడో అని.. రాజకీయ ప్రముఖుల్లో ఒకింత ఉత్కంఠ నెలకొంది. చూడాలి మరి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







