ఫిబ్రవరి 10, 11 తేదీలలో కువైట్‌లో అబ్రాడ్ స్టడీ ఎక్స్‌పో

- February 07, 2024 , by Maagulf
ఫిబ్రవరి 10, 11 తేదీలలో కువైట్‌లో అబ్రాడ్ స్టడీ ఎక్స్‌పో

కువైట్: కువైట్‌లో ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో రీజెన్సీ హోటల్ సాల్మియాలో అతిపెద్ద స్టడీ అబ్రాడ్ ఎక్స్‌పోను నిర్వహిస్తున్నారు. "స్టడీ అబ్రాడ్ ఎక్స్‌పో" విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆస్ట్రేలియా, కెనడా, యూకే, యూఎస్ఏ లలోని యూనివర్సిటీ ప్రతినిధులను కలవడానికి, వారి కెరీర్ ప్లాన్‌లు, స్కాలర్‌షిప్‌లు, అడ్మిషన్ మరియు వీసా వివరాల గురించి మాట్లాడటానికి అవకాశాన్ని అందిస్తుంది. మెడిసిన్, డెంటిస్ట్రీ లేదా ఫార్మసీలో కెరీర్‌ను అభ్యసిస్తున్న వారికి, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్‌లు ఆయా ప్రోగ్రామ్‌లపై ప్రత్యేక సమాచారాన్ని అందిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల వివరాలను ఒకే వేదికలో తెలుసుకోవచ్చు. స్టడీ అబ్రాడ్ ఎక్స్‌పోకు ప్రవేశం ఉచితం. రిజిస్ట్రేషన్ కోసం https://expogcc.com/study-abroad-expo-kuwait/ లింక్‌ని క్లిక్ చేయాలి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com